![]() |
![]() |
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -28 లో.....గంగకి సారె ఇవ్వాలని శంకుంతల చీర, తాళిని తీసుకొని బయలుదేర్తుంది. వద్దని పెద్దసారు అంటాడు. నేను తనకి ఎలాగైన ఇవ్వాలని శకుంతల అంటుంది. వెళ్లనివ్వండి మావయ్య అవసరం అయితే నేను తోడు వెళ్తానని.. వీరు, ఇషిక ఇంకా వీరు భార్య తనతో పాటు బయల్దేరతారు. మరొకవైపు లక్ష్మి కన్పించడం లేదని గంగ ఫ్రెండ్స్ తనకి చెప్తారు.
అప్పుడే పైడిరాజుని అబ్బాయి పిలిచి.. నువ్వు టెన్షన్ పడకు మీ భార్యని నేనే దాచాను.. పెళ్లి అయినాక వస్తుందని చెప్తాడు. మంచి పని చేశారని గంగ దగ్గరికి పైడిరాజు వెళ్లి.. మీ అమ్మకి కళ్ళు తిరిగినట్లు అయితే హాస్పిటల్ కి అల్లుడుగారు పంపించారు.. వస్తుంది.. నువ్వు టెన్షన్ పడకని పైడిరాజు అంటాడు. గంగ పెళ్లిపీటలపై కూర్చొని ఉంటుంది. శకుంతల సారె తీసుకొని వస్తుంది తనని చూసి గంగ హ్యాపీగా ఫిల్ అవుతుంది. చీర మార్చుకుంటానని గంగ గదిలోకి వెళ్తుంది. మరొకవైపు వీరు ప్లాన్ లో భాగంలో రుద్రని పోలీసులు అరెస్ట్ చేసేలా చేస్తాడు. ఆ తర్వాత గంగ గదిలోకి వెళ్తుంది.
పొరపాటుగా శకుంతల ఇచ్చిన తాళి పక్కరూమ్ లో పడుతుంది. అది తీసుకోవడానికి గంగ ఆ రూమ్ లోకి వెళ్తుంది. లక్ష్మిని బంధించింది అదే రూమ్ లో.. ఏదో సౌండ్ వస్తుందని గంగ వాళ్ళ అమ్మకి దగ్గరగా వెళ్తుంది. తరువాయి భాగంలో పోలీస్ స్టేషన్ లో ముఠాల లిస్ట్ లో బోర్డు పై గంగని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫోటోని రుద్ర చూస్తారు. మరొక వైపు గంగ పెళ్లి దగ్గర నుండి తప్పించుకుంటుంది. ఆ విషయం తెలిసి అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |